Header Banner

సామాన్యులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఢమాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే.!

  Sat Apr 12, 2025 10:37        Business, Politics

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం అవుతున్నాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ఈ పతనం మరింత పెరుగుతోంది. శుక్రవారం నాడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.6 శాతం తగ్గి 63.71 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 0.63 శాతం పడిపోయి 60.45 డాలర్ల దగ్గర నిలిచింది. ఇది శాంపిల్ మాత్రమే. మున్ముందు భారీ పతనం కనిపించబోతోంది. గత వారంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్, WTI) క్రూడ్ సూచీలు 2.5 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి, అంతకుముందు వారం 11 శాతం పతనం నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో 60 డాలర్ల దిగువకు చేరింది కూడా. 2021 ఫిబ్రవరి తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అటు అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికా విధించిన టారిఫ్‌లు చమురు ధరలపై భారీ ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి అనేందుకు ఇది మరో సంకేతం. 2025, 2026లో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ తగ్గుతుందని EIA అంచనా వేసింది. చైనా, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఇప్పుడు ఆ దేశం అమెరికా టారిఫ్‌ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంటే.. చైనా నుంచి వెళ్లే ఉత్పత్తులను అమెరికాలో కొనేవారి సంఖ్య తగ్గిపోతుంది.

 

ఇది కూడా చదవండి: మళ్లీ జైలుకు చేరిన వైసీపీ నేత! రాత్రికి రాత్రే రాజమండ్రికి తరలింపు!

 

దాంతో.. అమెరికా ఎగుమతులు తగ్గుతాయి. దాంతో.. చమురు వాడకం తగ్గిపోతుంది. దాంతో.. ప్రపంచంలో చమురుకి డిమాండ్ తగ్గి, ధర తగ్గుతుంది. ఇలా చైనా మాత్రమే కాదు.. చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతం తగ్గితే, చమురు వాడకం 1 శాతం పడిపోతుంది అని ANZ బ్యాంక్ విశ్లేషకుడు డేనియల్ హీనెస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి? అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్ సగటు ధర రూ. 110-112, డీజిల్ రూ.98-100 మధ్య ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ. 108-110, డీజిల్ రూ. 96-98 మధ్య ఉంది. చమురు ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాలతో, మన రెండు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.3-5, డీజిల్ రూ.2-4 వరకు తగ్గే అవకాశం ఉంది. ఎప్పటికి తగ్గే అవకాశంఈ ధరల తగ్గుదల రాబోయే 2-3 వారాల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అంతర్జాతీయ చమురు ధరల మార్పులు భారతదేశంలోని రిటైల్ ధరలపై కనిపించడానికి సాధారణంగా కొంత సమయం పడుతుంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, వ్యాట్‌లలో ఎలాంటి మార్పులు చేస్తాయన్న దానిపై కూడా ఈ తగ్గుదల ఆధారపడి ఉంటుంది. నిపుణుల అంచనాల ప్రకారం, 2025 మే నాటికి చమురు ధరల్లో స్థిరత్వం రావచ్చు. ఇది రాష్ట్రాల్లో ఇంధన ధరలను మరింత తగ్గించే అవకాశం ఉంది. ఈ ధరల తగ్గుదల సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ, టారిఫ్ వివాదాలు, ఆర్థిక అస్థిరతలు మార్కెట్‌ను ఇంకా అనిశ్చితంగా ఉంచుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ పరిస్థితి దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు కేంద్రం కూడా.. అంతర్జాతీయంగా చమురు ధరలు దగ్గితే.. దేశంలో కూడా తగ్గించేలా చమురు కంపెనీలపై ఒత్తిడి తేవాలి. కానీ కేంద్రం అలా చెయ్యకుండా.. ధరలు తగ్గించకుండా.. ప్రజలపై భారాన్ని కంటిన్యూ చేస్తోంది. దీనికి తోడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలపై భారీగా పన్నులు వేస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గనివ్వకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై గళం ఎత్తకపోవడం, ఆందోళనలేవీ చెయ్యకుండా సైలెంటుగా ఉండటం కూడా ధరలు భారీగా పెరగడానికి కారణం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations